అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని బస్సు ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గయాపడ్డారు. ఈ విషాదకర సంఘటన విఖాఖలోని గాజువాక శ్రీనగర్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి నుంచి రామభద్రాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు శ్రీనగర్ వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.
ఈ ప్రమదంలో బస్సు డ్రైవర్ రాంబాబుతో పాటు ఈశ్వరమ్మ అనే ప్రయాణికురాలు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రును కేజీహెచ్ హాస్పిటల్కు తరలించిన పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.