హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్‌ను కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయర రహదారిపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి టెంపో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో అందులో చిక్కుకున్నవారిని వెళికితీసి మదనపల్లిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల వివారాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన టెంపో ట్రావెలర్ కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉండటంతో బాధితులంతా ఆ రాష్ట్రానికి చెందినవారై ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.