Road Accident | నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాలలోని దవాఖానకు తరలించారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు బస్సులు మార్గంమధ్యలో ఆళ్లగడ్డ వద్ద ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీకృష్ణ ట్రావెల్స్‌లో ఇద్దరు, మరో బస్సులో ఒకరు మరణించారు. మృతిచెందినవారి వివరాలు తెలియాల్సి ఉంది.