అమరావతి : గుంటూరు ( Guntur) జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని నారాకోడూరు, బుడంపాటు గ్రామాల మధ్య కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటోలో (Auto) ఉన్న సుద్దపల్లి మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ ఉన్నారు. గాయపడ్డ మహిళను గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.