తిరుమల : టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్గా బీఆర్ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది. సభ్యుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు కల్పించారు. కర్ణాటకకు చెందిన ముగ్గురిని, తమిళనాడుకు చెందిన ఇద్దరిని నియమించారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. బీజేపీ నుంచి ఒకరి పేరు ప్రతిపాదన వచ్చిన తరువాత ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.