ఆదివారం 29 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 25, 2020 , 20:11:52

తెప్పోత్సవం: హంస వాహనంపై ఉత్సవమూర్తులు

తెప్పోత్సవం: హంస వాహనంపై ఉత్సవమూర్తులు

అమరావతి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కృష్ణానదిలో హంస వాహనంపై దేవతా మూర్తులను ఊరేగించారు. కరోనా నేపథ్యంలోనిబంధనలు పాటిస్తూ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో హంస వాహనంపైకి పరిమిత సంఖ్యలో వీఐపీలు, అధికారులకు అనుమతిచ్చారు. శివాలయం మెట్ల దారి నుంచి దుర్గాఘాట్ వరకు ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నదిలో జలవిహారం లేకుండానే అధికారులు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.