అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉరవకొండ చౌడేశ్వరి దేవాలయంలో ఓ దొంగ అమ్మవారి నగలను అపహరించాడు. ఆలయం వెనుక భాగం నుంచి వచ్చి దొంగ ఆలయంలోకి ప్రవేశించాడు. అనంతంర గర్భగుడి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి అమ్మవారి విగ్రహంపై ఉన్న 12.5 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఉదయం ఆలయానికి వచ్చిన ఆలయ అర్చకుడు ఆలయంతో దొంగతనం జరిగిందని గుర్తించి ధర్మకర్తకు సమాచారం ఇచ్చారు.
ధర్మకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీంతో దొంగ వేలిముద్రలను సేకరించారు. అమ్మవారిపై ఏడున్నర లక్షల రూపాయల విలువైన అమ్మవారి కిరీటం, చేతులు, ఇతర వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల్లో చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి .