శ్రీవారి లడ్డు కౌంటర్లో రూ. 2 లక్షలు చోరీ..పోలీసులకు ఫిర్యాదు
తిరుమల పుణ్యక్షేత్రంలో వరుస ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రంలో వరుస ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇటీవల డ్రోన్ సహాయంతో తిరుమల ఆలయాన్ని చిత్రీకరించిన విషయం సద్దుమణగక ముందే శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో చోరీ జరగడం కలకలం సృష్టిస్తుంది. స్వామివారి సన్నిధిలో దర్శనం అనంతరం భక్తులకు టీటీడీ 50 లడ్డూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
36వ నంబర్గల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో రాత్రి కౌంటర్ బాయ్ నిద్రపోతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. కౌంటర్ లోని రూ. రెండు లక్షలను దోచుకెళ్లడంతో కౌంటర్ బాయ్ టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిర్ధారించుకున్న అధికారులు తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
లడ్డూ కౌంటర్ సహా పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఇదే నిందితుడు గతంలోనూ తిరుమలలో పలు చోరీలకు పాల్పడ్డాడని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

