అమరావతి : అరవై నాలుగు కళల్లో దొంగతనం కూడా ఓ కళ అని నిరూపించుకున్నాడు ఓ చోరుడు. పోలీసులకు చిక్కకుండా, ఏ ఒక్క అనవాలు దొరకకుండా దొంగలు నానా రకాల వేషాధారణలో వచ్చి ప్రజలను, ఆస్తులను దోచుకెళ్లడం పరిపాటైనా విషయం తెలిసిందే. పోలీసులకు ఏ చిన్న క్లూ దొరికినా ఎక్కడా ఉన్నా పట్టుకుని బొక్కలో వేయడం కూడా అందరికి తెలిసిందే.
ఇటీవల కాలంలో ప్రతి వీధిలోనూ, ప్రతిషాపులోనూ సీసీ కెమెరాల ( CC Cameras )ను ఏర్పాటు చేసుకున్నప్పటికి దొంగలు మాస్కులు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. చిన్నపాటి పొరపాటు వల్ల దొరికిపోతుండడంతో ఓ దొంగ ఏకంగా సింహం మాస్కుతో దోపిడీకి పాల్పడ్డాడు. కోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో ఇటీవల ఓ దొంగ సింహం మాస్క్ ( Lion Mask) ధరించి కిరాణా షాపులో దొంగతనానికి పాల్పడ్డాడు.
సింహం మాస్క్ ధరించి కిరాణా షాపులో డబ్బులు, సామాన్లు ఎత్తుకెళ్లిన దొంగ
అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో వెరైటీ దొంగతనం pic.twitter.com/e9pLzJpBrF
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2026
షాపులోని డబ్బులు, సామాన్లు దొంగిలించి పారిపోయాడు. మరుసటి రోజు దుకాణానికి వచ్చిన యజమాని దుకాణంలో నిలువ ఉంచిన డబ్బు, సరుకు దొంగతనం జరిగినట్టు గ్రహించి సీసీ కెమెరాలను పరిశీలించగా అవాక్కయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.