తిరుమల : శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా, గోవిందా హరి గోవిందా.. గోకుల నందా గోవిందా అంటూ భక్తుల నామస్మరణతో తిరుమల( Tirumala ) గిరులు మారుమ్రోగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం ( Vaikuntha Dwaram ) తో స్మామివారిని దర్శించుకుంటే ఆ దేవదేవుడు కరుణిస్తాడన్న నమ్మకంతో భక్తులు వైకుంఠపురానికి చేరుకుంటున్నారు. నిన్న స్వామివారిని 70,256 మంది భక్తులు దర్శించుకోగా 25,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.79 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.