అమరావతి : రోడ్డుపై నిలిచిపోయిన లారీని మరమ్మతులు చేస్తుండగా మరో టిప్పరల్ లారీ వచ్చి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఏపీలోని కోనసీమ జిల్లా (Konaseema District) రావులపాలెంలోని గౌతమి కొత్త వంతెనపై అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
వంతెనపై లారీ ఆగిపోవడంతో లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి మరమ్మతులు (Lorry Repair) చేస్తుండగా టిప్పర్ లారీ అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.