Srisailam | శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం ఇప్పటి వరకు చేరలేదు. ఎగువ ప్రాంతాల వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల వరద నీటి చేరిక ఆలస్యమవుతున్నది. గురువారం సాయంత్రానికి రిజర్వాయర్ నిల్వ 808 అడుగులుగా నమోదైంది.అదే విధంగా కుడిగట్టు, ఎడమగట్టు జలవిద్యుదోత్పత్తి కేంద్రాలు కూడా ఉత్పతికి సిద్దంగా ఉన్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.
శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వలు 215 టీఏంసీలు కాగా ప్రస్తుతం 808.80 అడుగులు ఉండగా 33.62 టీఏంసీల నీటి నిల్వలో 48 క్యూసెక్కుల నీరు ఆవిరైందని అధికారులు తెలిపారు.