అమరావతి : తిరుమలలో ( Tirumala ) వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. బుధవారం 78,067 మంది భక్తులు దర్శించుకోగా 31,158 మంది తలనీలాలు సమర్పించారు.
స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. 4.16 లక్షల లడ్డూను విక్రయించామని సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తుంది. దర్శనం టికెట్లు లేని భక్తులు నిర్దేశిత సమయానికి క్యూలైన్లలో నిలబడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.