తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు ( TTD Officials 0 వెల్లడించారు.
నిన్న స్వామివారిని 64,850 మంది భక్తులు దర్శించుకోగా 28,816 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 2.70 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం
తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆదేశాల మేరకు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను ( Security ) పెంచుతున్నారు. ఇందులో భాగంగా అధికంగా భక్తులు వచ్చే తిరుమలలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ( SP Harsavardanraju) జిల్లా అధికారులతో సమావేశమై తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రత అంశాలపై చర్చించారు. శుక్రవారం మధ్యాహ్నం భద్రత బలగాలతో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు.