తిరుమల: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా తిరుమలలో గురువారం స్వర్ణరథం ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జట్టి, సీఈ నాగేశ్వరరావు, హెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, వెల్ఫేర్ ఆఫీసర్ దామోదరం, ఇతర అధికారులు స్వర్ణరథం ఊరేగింపులో పాల్గొన్నారు.
టీటీడీకి చెందిన 200 మంది మహిళా ఉద్యోగులు, భక్తులు గోవిందా గోవిందా అంటూ భక్తిశ్రద్ధలతో బంగారు రథాన్ని లాగారు. నాలుగు మాడ వీధుల్లో స్వర్ణ రథంపై శ్రీవారి ఊరేగుంపు మహోత్సవం కన్నులపండువగా జరిగింది.