Lathi charge | అసెంబ్లీ ముట్టడికి యత్నించిన సర్పంచులపై పోలీసుల లాఠీచార్జి .. పలువురికి గాయాలు
Lathi charge | గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన సర్పంచుల పై పోలీసులు లాఠీచార్జి చేశారు.
అమరావతి: గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన సర్పంచుల (Sarpanches) పై పోలీసులు లాఠీచార్జి (Lathi charge) చేశారు. వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను వైసీపీ ప్రభుత్వం వాటిని దారిమళ్లించిందని, ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకే ఇవ్వాలని సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి పిలుపునిచ్చింది.
వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కార్లలో పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ వచ్చిన సర్పంచులు నినాదాలు చేస్తూ అసెంబ్లీ(AP Assembly) పరిసర ప్రాంతాలకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సర్పంచులకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. చివరకు పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఒక దశలో సర్పంచులు పోలీసులు కాళ్లు పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.
చివరకు సర్పంచులను పోలీసులు ఈడుకెళ్లి బస్సులో వేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. గ్రామ సచివాలయాలు, వాలంటర్లను సర్పంచుల ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ను ఉయ్యూరులో, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులను మందడంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

