అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల (General election ) ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దాదారు రెండు నెలల పాటు హోరాహోరిగా సాగిన ప్రచారం 60 రోజుల అనంతరం పోలింగ్‌కు 48 గంటల ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ (Notification) మార్చి 16న విడుదల కావడంతో ఎన్నికల కోడ్(Election Code) అమలులోకి వచ్చింది.
ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ (Assembly seats) స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి ఏప్రిల్ 25 నుంచి నామినేషన్లు, 26న స్క్రూట్నీ, 29 వరకు 29 విత్ డ్రా కార్యక్రమం జరిగింది. దాదాపు 14 రోజుల పాటు జరిగిన ప్రచారంలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీతో , కూటమిగా ఏర్పడ్డ బీజేపీ, జనసేన, మరో వైపు కాంగ్రెస్ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది .
ప్రచార ఘట్టం ముగియడంతో అధికారులు పోలింగ్‌కు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. రేపు ( ఆదివారం ) పోలింగ్ ఫెసిలిటేషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో 4,44,216 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయని తెలిపారు. మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4,44218 పోస్టల్ బ్యాలెట్లు పోలైనట్లు వివరించారు.
ఈ నెల 4 నుంచి 9 వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని వివరించారు. హింసకు, రీపోలింగ్‌కు తావులేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు జరిపేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. కోడ్ అమలులో ఉన్నందున శనివారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసేవరకు అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.