అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఏపీ సచివాలయంలో కొద్ది సేపట్లో భేటీ కానున్నది. ఈ సమావేశంలో టికెట్ల డ్రాఫ్ట్ రికమండేషన్లపై చర్చించనున్నారు. ఇప్పుడున్న 3 క్లాసులకు బదులుగా రెండింటినే తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. 35 జీఓ ప్రకారం భౌగోళిక క్యాటగిరిలో 4 ప్రాంతాలను 3గా, గ్రామ, నగర పంచాయతీలను కలిపి నగర పంచాయతీ ఏరియాగా చేసిన సిఫార్సులపై కమిటీ చర్చించనుంది .
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో టికెట్ క్లాసుల్లోనూ సవరణలకు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న 3 క్లాసులకు బదులుగా 2 క్లాసులను తీసుకొచ్చేందుకు భావిస్తుంది. ఇటీవల ప్రభుత్వం సినీరంగ ప్రముఖులతో భేటీ అయిన చర్చించిన పిదప అందరికీ అమోదయోగ్యంగా సినిమా టికెట్లు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే జరిగితే డీలెక్స్ క్యాటగిరి కనుమరుగవుతుందని సినిమా ప్రియులు అంటున్నారు.