 
                                                            అమరావతి : రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పోలీసుయంత్రాంగం మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పై అక్రమంగా కేసులు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambatirambabu) ఆరోపించారు. రెడ్‌బుక్(Red Book) అమలు చేయడంలో భాగంగానే జగన్‌తో పాటు ఇద్దరు ఐపీఎస్, మరో ఇద్దరు అధికారులపై నమోదు చేశారని మండిపడ్డారు.
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. 2021లో అప్పటి ఎంపీ రఘురామరాజుపై వైసీపీ ప్రభుత్వం (YCP Government) చట్టపరంగా కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ మారి టీడీపీ (TDP) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత జగన్‌పై కక్ష తీర్చుకోవడానికి చంద్రబాబు, లోకేష్‌తో మిలాఖతై అధికారులకు ఆదేశాలు జారీ చేసి జగన్‌పై కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని, కాలం గిర్రున మళ్లీ తిరిగి వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు, కార్యకర్తలను కొడుతున్నారు, వేధిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, పెట్రోల్ పోసి దహనం చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం పాపాలు చేస్తుంది. సంప్రాదాయానికి విరుద్దంగా ప్రవర్తిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
Read more :
వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వైసీపీకి సంబంధం ఏంటి? ఆయన కాంగ్రెస్ మనిషి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
 
                            