అమరావతి : ఏపీలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధ్వంసంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అమర్నాథ్ ఆగ్రహం (Former minister Amarnath) వ్యక్తం చేశారు. విశాఖలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
రెడ్ బుక్(Red Book) రాసుకున్నవి అమలు చేస్తామని టీడీపీ భావిస్తే అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అవకాశాలు అందరికి వస్తాయని గుర్తించాలని సూచించారు.ప్రతిదానికి ప్రజలు సమాదానం చెబుతారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూటమి ప్రభుత్వం విధ్వంసాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బుల్డోజర్ల(Bulldozers) ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు.
విశాఖలో కార్పొరేటర్ ఇంటిపై రాళ్లతో దాడిచేసి అద్దాలు పగులగొట్టారని ఆరోపించారు.ప్రభుత్వ ఆస్తులు, వ్యకిగత దాడులకు పాల్పడ్డ ప్రభుత్వం నేడు వైసీపీ పార్టీ (YCP Party) కార్యాలయాలను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. కేసు కోర్టులో ఉండగా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడం దారుణమని పేర్కొన్నారు.