YS Sharmila | కాలయాపన తప్ప‘ ఫ్రీ బస్’ అమలుపై చిత్తశుద్ధి లేదు : కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
YS Sharmila | మహిళలకు ఫ్రీ బస్ (Free Bus ) పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
అమరావతి : మహిళలకు ఫ్రీ బస్ (Free Bus ) పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. టీడీపీ , జనసేన పార్టీలకు కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని ట్విట్టర్ (Twitter) వేదిక ద్వారా విమర్శించారు.
అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారు. బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. చిన్న పథకం అమలుకు కొండంత కసరత్తు దేనికోసమని నిలదీశారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా ? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా ? మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని పేర్కొన్నారు. కనీసం నూతన సంవత్సర కానుక కిందైనా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని, చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

