ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 64.23 శాతం ఉత్తీర్ణత లభించింది. సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రంలో 1,91,846 విద్యార్థులు హాజరు కాగా.. 1,23,231 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 60.83 శాతం, బాలికలు 68.76 శాతం పాసయ్యారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 87.52 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అతి తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లలో 46.66 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ఇలాఉండగా, మరోసారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదే చివరిసారి అని ఆయన చెప్పారు. విద్యార్థులు కూడా సక్రమంగా చదువుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల విలీనం చేయలేదని, కేవలం తరగతుల గదులను మాత్రమే విలీనం చేసే పనులు చేపట్టామని బొత్స తెలిపారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, చదువులతో పాటు ఆటలు, ఇతర అంశాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

