అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో రేపటి ( సోమవారం ) నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు (Tenth Exams) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగనున్నాయి. అయితే ఫిజకల్ సైన్స్ ( Physical Science) , బయలాజీకల్ ( Biological ) సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తెలుగు, ఇంగ్లిష్ మీడియం 6.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే పరీక్షల హాల్ టికెట్లను ప్రభుత్వం జారీ చేసిందని అధికారులు వివరించారు .