అమరావతి : ఏపీలో జరుగుతున్న ఎన్నికలు పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్త (Tension ) పరిస్థితులకు దారితీసాయి. సోమవారం మధ్యాహ్నం నరసారావుపేట(Narasaraopet) వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ (MLA Gopireddy) ఇంటిపై ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు (Police) పరిస్థితిని చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఈ రబ్బరు బుల్లెట్ల వల్ల పలువురికి స్వల్పగాయాలయ్యాయి.
తాడిపత్రి, పులివెందుల, ఇతరచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.