(Balakrishna) అనంతపురం: హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, నటుబు నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బాలకృష్ణ ఇంటిని సీజ్ చేసేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. వీరిని అడ్డుకునే ప్రయత్నంలో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఇరువర్గాల మధ్య ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు బాలకృష్ణ ఇంటికి చేరుకుని వైపీసీ శ్రేణులను అడ్డుకుని పంపించివేశారు. ఘర్షణకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య వివాదం డంపింగ్ యార్డుతో మొదలైంది. టీడీపీ నేత ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణ ఇంటిని సీజ్ చేస్తామంటూ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు కూడా తరలిరావడంతో వాతావరణం వేడెక్కింది. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు అభివృద్ధిపై టీడీపీ చేస్తున్న సవాల్‌ను స్వీకరించి బాలకృష్ణ ఇంటికి వచ్చామని వైసీపీ నేతలు చెప్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో అధికార పార్టీని టీడీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరుకున్నది. పరిస్థితి చేయిదాటకముందే పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..