Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ వీ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్కే మీనా దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున శ్రీకృష్ణరాయ గోపురం వద్దకు చేరుకున్న వారికి దేవస్థానం ఈఓ పెద్దిరాజు, అర్చక, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం జస్టిస్ ఈవీ వేణుగోపాల్, ఆర్కేమీనాలు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకాలు, కుంకుమార్చనలు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదం, జ్ఞాపికను అందించారు.
ఈ కార్యక్రమంలో ఈఓ పెద్దిరాజుతోపాటు ఆలయ అధికారులు, శ్రీశైలం వన్ టౌన్ సీఐ ప్రసాద్ రావులు పాల్గొన్నారు.
Ola Electric Motorbike | వచ్చే ఏడాది ఓలా ఈవీ మోటారు సైకిల్.. తెగేసి చెప్పిన భవిష్ అగర్వాల్..!
Realme Narzo N61 | రియల్మీ నుంచి బడ్జెట్ ఫోన్ రియల్మీ నార్జో ఎన్61.. ఇవీ డీటెయిల్స్..!
Oppo K12x 5G | ఒప్పో నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ.. ఇవీ డీటెయిల్స్..!