అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వైఎస్ జగన్‌ను(YS Jagan) ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కు టెట్(TET) నిబంధన సరికాదని వివరించారు. బీఈడీ చేసి 25 ఏండ్లే క్రితం ఉద్యోగం సాధించిన తమకు మళ్లీ టెట్ పరీక్ష రాయాలనడం సరైంది కాదన్నారు.
ఈ విషయంలో జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సానకూలంగా స్పందించిన జగన్ సమస్య పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీనిచ్చారు.