అమరావతి : విద్యుత్ ఛార్జీలు కట్టేందుకు దానం ఇవ్వాలంటూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు కట్టేందుకు పేదల వద్ద డబ్బులు లేవని రోడ్డుపై ద్విచక్రవాహనదారులు, బస్సుల్లో ప్రయాణికుల వద్ద భిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో ఏడుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు లేక ప్రజలపై భారం మోపుతున్న వ్యక్తి భారతదేశంలో జగన్ మోహన్‌రెడ్డి తప్ప ఎవరూ లేరని విమర్శించారు.