అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) విదేశి పర్యటనను ముగించుకుని బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్(Hyderabad) కు చేరుకున్నారు. ఈనెల 13న జరిగిన ఎన్నికల అనంతరం 19వ తేదీన చంద్రబాబు సతీసమేతంగా విదేశాలకు వెళ్లారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో (Elections) భాగంగా రెండు నెలల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్రాంతి కోసం ఆయన విదేశాలకు వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Air Port) లో ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
ఎల్లుండి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాక
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan) ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు. పోలింగ్ తరువాత ఈనెల 17న రాత్రి విదేశాలకు వెళ్లారు. లండన్, ప్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు సతీమణి భారతితో కలిసి వెళ్లారు. ఈనెల 31న తిరిగి ఏపీకి రానున్నారు. జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఫలితాలకు ముందుగానే వైఎస్ జగన్, చంద్రబాబు పార్టీ శ్రేణులతో సమవేశమై అప్రమత్తం చేయనున్నారు.