ప్రకాశం జిల్లా : రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వస్తున్న ప్రజాధారణకు టీడీపీ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం దర్శిలో పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి లోను కావడం వల్లే ఇప్పటికీ ప్రజలు ఆయనను అన్ని ఎన్నికల్లో ఓడిస్తున్నారని పేర్కొన్నారు.
ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీకే ఓటర్లు పట్టం కడుతున్నారని, ప్రసుత్తం తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని ఎద్దేవా చేశారు. అసత్యప్రచారాలతో కొనసాగడం ఆ పార్టీ నేతలకే చెల్లుతుందని ఆరోపించారు.