Tata Sons – Chandrababu | ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఆర్థికాభివృద్ధి కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్‌కు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 20247 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలన్న లక్ష్యంతో ఈ టాస్క్ ఫోర్స్ పని చేస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడ్ని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మేధావులు, పారిశ్రామికవేత్తలతో కలిపి ఏపీ అభివృద్ధికి ఏర్పాటు చేయనున్న టాస్క్‌ఫోర్స్‌కు చంద్రశేఖరన్.. కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పడం తనకు ఆనందంగా ఉందని చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
చంద్రశేఖరన్ తనకు పాత స్నేహితుడని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీతో కలిసి పని చేసేందుకు టాటా గ్రూప్ కూడా అంగీకరించిందన్నారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో అమరావతిలో ‘సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ ఆన్ కాంపిటీటివ్నెస్’ టాటా గ్రూప్ ఏర్పాటు చేస్తుందన్నారు. విశాఖపట్నంలో టీసీఎస్ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు, ఎయిర్ ఇండియా, విస్తారా ద్వారా రాష్ట్రానికి ఎయిర్ కనెక్టివిటీ పెంపు తదితర అవకాశాలపై చంద్రశేఖరన్‌తో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ భేటీలో ఏపీ మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ తోపాటు టాటా గ్రూప్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!
Redmi A3x | రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఏ3ఎక్స్.. ధరెంతంటే..?!