Srisailam | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం బంగారం వస్తువులు సమర్పించారు. 379 గ్రాములతో తయారు చేయించిన బంగారు కూర్మ సింహాసనం, 249 గ్రాములతో తయారు చేయించిన బంగారు పళ్ళెం సమర్పించారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ కూర్మ సింహాసనం, పళ్ళెం ఈఓ ఎం శ్రీనివాసరావు, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయస్వామిలకు అందజేశారు. అనంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి బీ మల్లికార్జునరెడ్డి, పీఆర్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.