తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ (Tirumala Laddu Issue) వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాటపట్టారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించవద్దని డిమాండ్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి తరదితరులపై చర్యలు తీసుకోవాలన్నారు. సేవ్ తిరుమల.. సేవ్ టీటీడీ నినాదాలతో హోరెత్తించారు. వారితో టీటీడీ ఈఓ శ్యామలరావు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గత పాలకమండలిపై చర్యలు తీసుకోవాలని ఈఓకు వినతిపత్రం సమర్పించారు.