SVIMS | స్విమ్స్ దవాఖానలో వైద్యురాలిపై చేయి చేసుకున్న రోగిపై చర్య తీసుకోవాలని స్విమ్స్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. అయితే, దాడి చేసిన రోగి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిలో అస్వస్తతకు గురైన భక్తుడ్ని చికిత్స కోసం స్విమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సదరు వ్యక్తి వైద్యురాలిపై దాడి చేశాడు. ఆ వ్యక్తిని నల్లగొండ జిల్లా వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు.. స్విమ్స్ లో మహిళా సెక్యూరిటీని నియమించాలని డిమాండ్ చేశారు.
స్విమ్స్ లో జూనియర్ డాక్టర్ల ఆందోళనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యుల భద్రతపై రాజీ పడే ప్రసక్తి లేదని పేర్కొంది. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమస్య సరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దవాఖాన అధికారులకు సూచించారు.