అమరావతి : మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకాహత్య కేసులో (Viveka Murder Case) 8వ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి (YCP MP Avinash reddy) సుప్రీంకోర్టు నోటీసులు(Notice) జారీ చేసింది. ఇదే కేసులో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అవినాష్ బెయిల్ రద్దు చేయాలని వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్‌పై సీజేఐ (CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా సునీత న్యాయవాది సిద్ధార్థలూథ్రా (Siddartha Luthra) వాదనలు వినిపిస్తూ అప్రూవర్‌ను శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి బెదిరించాడని ఆరోపించారు. ప్రైవేటు వైద్యుడు జైలుకెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి యత్నించారని పేర్కొన్నారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ వెళ్లిన వైద్యుడు రెగ్యులర్‌గా వెళ్లేవారా? కాదా? అని ప్రశ్నించారు. జైలు నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ చైతన్య వెళ్లారని , రెగ్యులర్‌గా వెళ్లే వైద్యుడు కాదని లూథ్రా వివరించారు. ఈ కేసులో డాక్టర్ చైతన్యను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని కోరారు.
కేసు దర్యాప్తులో అవినాష్‌రెడ్డి కీలకమైన వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా ఇరువురిని ప్రతివాదులుగా చేర్చడానికి సీజేఐ ధర్మాసనం అంగీకరించింది. విచారణను మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. మరోవైపు తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ దాఖలు చేసినా పిటిషన్‌పై విచారణ జరిగింది.