హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఏపీ ఫైబర్నెట్ సహా పలు ఎంఎస్వోలకు కోర్టు నోటీసులు ఇచ్చిం ది. దీనిపై మూడు వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
సాక్షి చానల్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.