తిరుమల : దక్షిణ కన్నడ కుక్కే సుబ్రహ్మణ్యంలోని సుబ్రహ్మణ్య మఠానికి చెందిన హెచ్‌హెచ్ విద్యాప్రసన్న తీర్థ (Vidyaprasanna Theertha) స్వామీజీ తిరుమల (Tirumala) లోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయానికి తీసుకెళ్లారు. స్వామివారి ప్రత్యేక పూజలు అనంతరం రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 63,619 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,572 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.78 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.