అమరావతి : ఏపీలోని ట్రిపుల్ ఐటీ(Triple IT) లో ఓ విద్యార్థి ఆత్మహత్య (Suicide) చేసుకోవడం కలకలం రేపుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన ఈసీఈ (ECE) మూడో సంవత్సరం విద్యార్థి సాయికార్తీక్ హాస్టల్ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సహచర విద్యార్థులను విచారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.