Viral news : కాలేజీ క్యాంపస్‌లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దని సెల్‌ఫోన్ లాక్కున్న మహిళా లెక్చరర్‌పై విద్యార్థిని చెప్పుతో దాడి చేసింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్యాంపస్‌లో విద్యార్థిని ఫోన్ మాట్లాడుతుండగా మహిళా లెక్చరర్ ఆ సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ఆగ్రహించిన విద్యార్థిని ‘రూ.12 వేల విలువైన నా సెల్ ఫోన్ లాక్కుంటావా..?’ అంటూ దూషణకు దిగింది. అసభ్య పదజాలంతో దూషించింది. అంతటితో ఆగకుండా చెప్పుతో కొట్టింది. దాంతో తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది షాకయ్యారు. కాగా ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం విచారణ జరుపుతోంది.