Nuzvidu IIIT | ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం జరిగింది. ల్యాబ్ ఎగ్జామ్‌కు అనుమతించలేదని ఓ విద్యార్థి రెచ్చిపోయాడు. ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో గోపాలరాజు ఎంటెక్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఎంటెక్ స్టూడెంట్ వినయ్ సరిగ్గా ల్యాబ్‌కు రావడం లేదని అతన్ని గోపాలరాజు ప్రశ్నించాడు. ల్యాబ్ ఎగ్జామ్ రాయడానికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు విద్యార్థి ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా ప్రొఫెసర్‌పై దాడి చేసిన అనంతరం హాస్టల్లోకి పారిపోయాడు.
అప్రమత్తమైన విద్యార్థులు, సహచర సిబ్బంది వెంటనే ప్రొఫెసర్ గోపాలరాజును నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ గోపాలరాజుకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కాగా, ప్రొఫెసర్‌పై కత్తితో దాడి ఘటనతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. క్యాంపస్‌కు వచ్చి పరిశీలించారు. ఈ దాడిపై దర్యాప్తు చేపట్టారు. కాగా, దాడి చేసిన విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.