అమరావతి : అనకాపల్లి జిల్లాలో చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత తీవ్రంగా స్పందించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. అనకాపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో బీ ఫార్మసీ విద్యార్థిని తేజశ్విని ఘటనలపై ఆరా తీశారు. ఉన్నతాధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.
అనకాపల్లి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.