అమరావతి : ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనిమంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. ఆర్థికాభివృద్ధి, ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో బహుళ భారీ పరిశ్రమలను (Multiple industries) స్వాగతించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. శనివారం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పూజలు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరికి శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పారిశ్రామిక వృద్ధిని సాధిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సజావుగా, విజయవంతమైన అభివృద్ధి జరగాలని, పౌరుల శ్రేయస్సును కోరుతూ శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ (Devotees rush) కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 69,098 మంది శ్రీవారిని దర్శించుకోగా 34,707 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.56 హుండీకి ఆదాయం వచ్చిందన్నారు .