శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 22:01:47

అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి :  అధికార పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దురుద్దేశాలు అంటగడుతున్నారని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. పంచాయతీ రాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్‌ శాఖ సెక్రటరీ గిరిజాశంకర్‌పై ఎస్‌ఈసీ వైఖరి గందరగోళంగా ఉందని ఆయన అన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

ఏకగ్రీవాలపై ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటన ఇచ్చిందని, ప్రకటనల్లో రాజకీయం ఎక్కడుందో ఎస్‌ఈసీ చెప్పాలని నిలదీశారు. ఏకగ్రీవాలపై ప్రోత్సాహకాలు కొత్త కాదని అన్నారు. ఏకగీవ్రాలను తప్పుబట్టే అధికారం ఎస్‌ఈసీకి లేదని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు ఎక్కువైతే వ్యతిరేకిస్తామనడం సరికాదని అన్నారు. కాగా,, ఏపీ ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ద్వివేది, గిరిజాశంకర్‌లు ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కోర్టుకు చెప్పి కూడా ఆ పనులు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొంటూ వారిద్దరినీ ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎస్‌ఈసీ ప్రొసిడింగ్స్‌ జారీచేసిన విషయం తెలిసిందే.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo