అమరావతి : విశాఖ ఫార్మా సిటీ ( Pharma City ) లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలవాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఉదయం పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీ భారీగా మంటలు చెలరేగి అందులో పనిచేస్తున్న త్రినాథ్, వెంకటేశ్ అనే ఇద్దరు కార్మికులు సజీవదహనం అయ్యారు.
విషయం తెలుసుకున్న జగన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలను అమలు చేయాల్సిన అవసరం పేర్కొన్నారు.
ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, హోం మంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని , గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తామని వివరించారు.