Tirumala | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేయనుంది. దీంతో రేపటి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 19న సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శనివారం నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. శని, ఆదివారాల్లో సర్వదర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.