అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 కంపార్టుమెంట్లలో భక్తులు
వేచి ఉన్నారని, దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని
71,914 మంది భక్తులు దర్శించుకోగా 37,234 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చిందని వెల్లడించారు.