TTD EO | శ్రీవారి గరుడ సేవ విజయవంతం.. భక్తులకు సంతృప్తికర దర్శనం: టీటీడీ ఈవో
TTD EO | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన(Garuda Seva) సేవను టీటీడీ అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో జె.శ్యామల రావు అన్నారు.
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన(Garuda Seva) సేవను టీటీడీ అధికారుల
సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో ( TTD EO) జె.శ్యామల రావు అన్నారు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి బుధవారం రాంభగిచా రెస్ట్ హౌస్ వద్ద టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుడ సేవలో ఆరోగ్యశాఖ (Health Department) సమర్దవంతంగా పని చేసిందని ప్రశంసించారు.
మరుగుదొడ్ల విషయం మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా మిగిలిన వాహన సేవలకు కూడా కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమవుతాయని పేర్కొన్నా. మధ్యాహ్నం సమయంలో ఎండలు తీవ్రత అధికంగా ఉందని, వచ్చే బ్రహ్మోత్సవాలకు గ్యాలరీల్లోని భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా షెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అడిషనల్ ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్యాలరీల వద్ద మరిన్ని శాశ్వత మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో మరో వందేళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్(Master Plan రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మాడ వీధుల్లో భక్తులు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై గందరగోళం ఉందని దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గరుడ వాహన సేవలో క్యాటరింగ్ విభాగం చాలా బాగా పని చేసిందని అభినందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

