Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 15 నుంచి 24వరకు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయని దేవస్థానం ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డిని డీ పెద్దిరాజుకలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.
నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్కు ఆయన కార్యాలయంలో డీ పెద్దిరాజు కలిసి దసరా మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు.
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి దసరా ఉత్సవాలకు రావాలని ఆహ్వానిస్తూ దేవస్థానం ఈవో డీ పెద్దిరాజు ఆహ్వాన పత్రిక అందజేశారు.
నంద్యాల జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డికి దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆయనను కలిసి పెద్దిరాజు ఆహ్వాన పత్రిక అందజేశారు.