ఉగాది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దాం: శ్రీశైలం ఆలయ ఈవో లవన్న
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే యాత్రికులకు అవసరమైన వసతులు కల్పిద్దామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రస్ట్‌బోర్డు సభ్యుల సమక్షంలో ఉగాది ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే యాత్రికులకు అవసరమైన వసతులు కల్పిద్దామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రస్ట్‌బోర్డు సభ్యుల సమక్షంలో ఉగాది ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఉత్సవాల్లో లోటుపాట్లను పరిగణలోకి తీసుకుని ఈసారి చేపట్టిన ముందస్తు ప్రణాళికను వివరించారు. అంతేకాకుండా మండలి సలహాలను కూడా అడిగి తెలుసుకుని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.
కాలినడక భక్తులకు కంకణధారణ
వివిధ ప్రాంతాల నుంచి శివనామస్మరణ చేస్తూ కాలినడకన వచ్చే భక్తులకు కైలాసద్వారం వద్ద దేవస్థానం వారు కంకణ ధారణ చేస్తున్నారు. స్వామి, అమ్మవార్ల స్పర్శ దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుండగా కాలినడక భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయ ప్రవేశం కల్పిస్తున్నారు.

శ్రీశైలంలో చిరువ్యాపారుల హల్చల్..
శ్రీశైలం మహాక్షేత్రానికి తోపుడుబండ్లతో వచ్చిన చిరువ్యాపారులు హల్చల్ చేస్తూ వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నందిసర్కిల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఈవో లవన్న స్వయంగా జోక్యం చేసుకుని.. తోపుడుబండ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయా? అని వారిని ప్రశ్నించారు. అలాగే, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆలయ రెవెన్యూ అధికారులు, ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డిని ఆదేశించారు. గత ఉత్సవాల్లో తాత్కాలిక షాపులు, తోపుడుబండ్ల వల్ల దేవస్థానానికి నష్టం వాటిల్లిందని, అలాంటివి పునరావృతం కాకుండా వ్యాపారానుసారంగా తగిన రుసుము వసూలు చేయాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

