Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Mokshagna నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది.
Mokshagna నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ చిత్రంలో కాజోల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కథలో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నారని టాక్. బాలకృష్ణతో కలిసి ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కాజోల్ నటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే చిత్రబృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ నటి రాషా తడానీ పేరు కూడా వినిపిస్తోంది. ఆమెను మోక్షజ్ఞ సరసన ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాషా తడానీ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె కావడంతో ఈ వార్తపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఆమె ఎంపిక కూడా ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
మోక్షజ్ఞను సాధారణ మాస్ కథతో కాకుండా, ఓ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులకు పరిచయం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే వశిష్ఠను దర్శకుడిగా ఎంచుకున్నారనే చర్చ సాగుతోంది. ఈ సినిమా భారీ సామాజిక కల్పిత కథా నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం.పలు కాలాలకు సంబంధించిన కథాంశాలు, పునర్జన్మల నేపథ్యం, అద్భుతమైన దృశ్యాలు, భారీ దృశ్య ప్రభావాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథలో గతం, వర్తమానం మధ్య ఆసక్తికరమైన అనుసంధానం ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ నిజమైతే మోక్షజ్ఞ తొలి సినిమానే భారీ స్థాయిలో రూపొందే అవకాశముంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bala krishna
- bollywood
- debut
- kajol
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఇంటిపై దాడికి యత్నం!
Vote for Note | ఓటుకు నోటు కేసు 25కు వాయిదా
డీహెచ్‌లో ఇద్దరు ఏడీల హల్చల్.. ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో ఉలికిపాటు!
Medchal | మేడ్చల్ జిల్లాలో అరుదైన రాతి చిత్రాలు
MP Vamsi Krishna | పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు నిరసన సెగ.. నిలదీసిన కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

